గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రువారం కమిషనర్ గారు నల్లపాడు, విద్యా నగర్, రెడ్డి పాలెం, ఎల్ ఆర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది రికార్డ్ చేయాలన్నారు. ఎమినిటి కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పనులను ప్రతి రోజు పరిశీలించాలని, నాణ్యతలో లోపం గుర్తిస్తే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. నల్లపాడు రైల్వే స్టేషన్ రోడ్ కల్వర్ట్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే అభివృద్ధి పనులకు సిద్దం చేసే అంచనాలను ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించాలన్నారు. పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ మధుసూదన్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …