విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శృంగేరీపీఠ జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత ప్రేలాపనపై స్వామి వారి భక్త బృందం శివరామ కృష్ణ క్షేత్రంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వేద పండితులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి మాట్లాడుతూ ఆదిశంకరులు స్థాపించిన పీఠాలలో శృంగేరి పీఠం ప్రధానమైనదన్నారు. నాటి నుంచి పీఠాధిపత్యం వహించన పీఠాధిపతులు ధర్మరక్షణకు కట్టుబడివున్నారన్నారు. పేద సంస్కృతిని కాపాడుతున్న వారిపై ఏమాత్రం అవగాహనలేని గోవిందానంద స్వామి మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సమర్ధనీయం కాదన్నారు. శివరామ కృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్ట్లా హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ కాయం కట్టిన ప్రతీ వారు స్వామీజీలు కాలేరని ధర్మవర్తన కలిగివుండాలని సూచించారు. శృంగేరి పీఠాన్ని కోట్లాది భారతీయులు తమ ఆరాధ్యదైవంగా భావిస్తారని వారి మనోభావాలను గౌరవించాలన్నారు. గురు సంప్రదాయాన్ని పాటించాలని భారతీయలకు గురువులను అందించిన భరత భూమిలో వివాదస్పద వాఖ్యలకు కూడదని హితవుపలికారు. గోవిందనాద స్వామి చేసిన వివాదస్పద వాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో మల్లాది రామనాధశర్మ, కప్పగంతు పండరినాధ్, గోరుగుంట రవి పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …