Breaking News

సద్గత విద్యానికేతన్‌ స్కూల్‌, జెకెఆర్‌ ఆస్ట్రో రీసెర్చ్‌ సంస్థ సంయుక్తంగా జ్యోతిష్య సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సద్గత విద్యానికేతన్‌ స్కూలు, మధురానగర్‌, జెకెఆర్‌ ఆస్ట్రో రీసెర్చ్‌ సంస్థ సంయుక్తంగా జ్యోతిష్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఆదివారం విజయవాడలోని గాయత్రి ఫంక్షన్‌ హాలులో ఈ కార్యక్రమం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ప్రొ. ఎన్‌విఆర్‌ఎ రాజా, జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యం గురించి ఉచితంగా జరిగే భోధన గూర్చి, శత జయంతి ఉత్సవం జరుపుతున్న పివికె పుణ్ణేశ్వరరావు గురించి వివరించారు. అనంతరం ముఖ్య అధితులు ప్రఖ్యాత వాస్తు, రాజకీయ, క్రీడా జ్యోతిష పండితులు రవిరావు, గురుపుత్రులు పివి చిరంజీవి, జ్యోతిష్యచార్య పిబి ఫణీంద్ర ప్రసంగించారు. ఈ సందర్భంగా జ్యోతిష్య ఆచార్యులకు శాలువాలతో సత్కరించి మెమెంటోలతో సత్కరించి బిరుదు ప్రధానం చేశారు. జ్యోతిష్యశాస్త్రం రెండు సంవత్సరాలు చదివి ఎంఎలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను అందించారు. జెకెఆర్‌ అస్ట్రో రీసెర్చ్‌ వారి అనుబంధ సంస్థ అయిన జ్యోతిష్య యోగ శాస్త్ర యూనివర్శిటీ, ఫ్లోరిడా, యుఎస్‌ఎ ద్వారా పరీక్షలు నిర్వహించి సీఈఓ హైమవతి చేతుల మీదుగా పట్టాలు అందచేసారు. సమావేశంలో వక్తలు మీనా2నాడి నక్షత్ర సిద్ధాంతంలోని పలు అంశాల గురించి ప్రసంగించారు. నక్షత్ర సిద్దాంతం ఆధారంగా జ్యోతిష్య శాస్త్రం సులభంగా నేర్చుకోవటానికి ప్రతి ఆదివారం విజయవాడలోని సద్గత విద్యానికేతన్‌ నందు ఉచిత తరగతులు నిర్వహిస్తున్నామని, జనవరి 2025న మొదలయ్యే కొత్త బ్యాచ్‌ కోసం వివరాలకు స్థానికంగా వున్న పివిఎ పద్మావతిని ఈ ఫోన్‌ నెంబరులో 6303641654 సంప్రదించాలని కోరారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వారు ఈ ఉచిత తరగతులు వినియోగించుకోవాలని ఎన్‌విఆర్‌ఎ రాజా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జ్యోతిష పండితులు రవిరావు, గురు పుత్రులు పివి చిరంజీవి, జ్యోతిష్యచార్య పిబి ఫణీంద్ర, పివికె పుణ్ణేశ్వరరావు, పివిఎ పద్మావతి, ఎన్‌విఆర్‌ఎ రాజా తదితరులు పాల్గొన్నారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *