Breaking News

పోలీస్ శాఖ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నాము : ఎంపి కేశినేని శివ‌నాథ్

-పోలీస్ శాఖ కి ప‌ది డ్రోన్స్ అందించిన ఎంపి కేశినేని శివ‌నాథ్
-జిల్లాలోని పోలీస్ స్టేష‌న్స్ కి డ్రోన్స్ పంపిణీ చేసిన సిపి రాజ‌శేఖ‌ర్ బాబు, ఎంపి కేశినేని శివ‌నాథ్
-డ్రోన్స్ ఫైల‌ట్స్ గా మ‌హిళ కానిస్టేబుల్స్ శిక్ష‌ణ
-ఎంపి కేశినేని శివ‌నాథ్ ను స‌న్మానించిన సిపి రాజ‌శేఖ‌ర్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ‌త ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల కేంద్రం నుంచి పోలీస్ శాఖ‌కి రావాల్సిన నిధులు రాలేదు. రాష్ట్రానికి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడు వ‌చ్చింది. నిధులు తెచ్చుకోవ‌టం తో గ‌త నిర్ల‌క్ష్య ధోర‌ణి తో వ్య‌వ‌హ‌రించింది..అందుకే రాష్ట్ర హోంమంత్రి అనిత‌తో చ‌ర్చించి కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్ శాఖ కి రావాల్సిన నిధుల‌పై నివేదిక‌లు త‌యారు చేసిన‌ట్లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఆ నివేదిక‌ల‌ను త్వ‌ర‌లో కేంద్రం ముందు పెట్టి నిధులు వ‌చ్చేందుకు కృషి చేయ‌బోతున్న‌ట్లు చెప్పారు. విజ‌య‌వాడ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ లో ఆదివారం జ‌రిగిన క్లౌడ్ పాట్రోల్ ఫ‌ర్ సేఫ‌ర్ క‌మ్యూనిటీస్ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ హాజరు అయ్యారు.

ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ కు సిపి రాజ‌శేఖ‌ర్ బాబు తో ఇత‌ర పోలీస్ అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సభకు అధ్యక్ష‌త వ‌హించిన సిపి రాజ‌శేఖ‌ర్ బాబు మాట్లాడుతూ పోలీస్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ సాంకేతికంగా మ‌రో ముంద‌డుగు వేసేందుకు ప‌ది డ్రోన్స్ ఇచ్చినందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ కు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ రావు ఒక డ్రోన్, ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ నాలుగు డ్రోన్స్, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు రెండు డ్రోన్స్ అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ క్లౌడ్ పాట్రోల్ ఫ‌ర్ సేఫ‌ర్ క‌మ్యూనిటీస్ పేరు చాలా బాగుందన్నారు. దేశంలోనే ప్ర‌ప‌థ‌మంగా 28 పోలీస్ స్టేషన్స్ లోను డ్రోన్స్ వాడే న‌గ‌రం విజ‌య‌వాడ అభివృద్ది సాధించిందంటే సీఎం చంద్ర‌బాబు కృషే కార‌ణమ‌న్నారు. విజ‌య‌వాడ‌లో డ్రోన్ షో సీఎం చంద్ర‌బాబు డ్రోన్ షో నిర్వ‌హించి విజ‌య‌వాడ కి గిన్నిస్ రికార్డ్ అందిస్తే….ఆ టెక్నాల‌జీ అందిపుచ్చుకున్న పోలీస్ క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర్ బాబు వాటిని వాడ‌కంలోతీసుకువ‌చ్చి…విజ‌వ‌యాడ డ్రోన్ సిటీ గా మార్చారని కొనియాడారు…

ఎన్టీఆర్ జిల్లాలోనే వుమెన్ ఎంప‌వ‌ర్ మెంట్ క‌నిపిస్తుందన్నారు.. మ‌హిళ పోలీసుల‌ను డ్రోన్ ఫైల‌ట్స్ త‌యారు చేసినందుకు సిపి రాజ‌శేఖ‌ర్ బాబును ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినందించారు. విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్ది కోసం పోలీస్ శాఖ‌- మున్సిప‌ల్ శాఖ క‌లిసి కృషి చేయాల‌న్నారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *