-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్, శాఖాధిపతులు సంయుక్త పరిశీలన నిర్వహించారు. అందులో భాగంగా నాల్గవ డివిజన్ లయోలా కాలేజ్ పరిసర ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి శాఖధిపతులే స్వయంగా ఫీల్డ్ లో దిగి ప్రతిరోజు సంయుక్త పరిశీలన చేయాలని తద్వారా ఒకరికొకరితో సమన్వయం ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని, నగర పరిధిలో ప్రతిరోజు శాఖాధిపతులు, సర్కిల్ పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సిటీ ప్లానర్, సచివాలయం పరిధిలో సానిటరీ, ఎమినిటీస్ మరియు ప్లానింగ్ సెక్రెటరీ సంయుక్త పరిశీలన చేయాలని కమిషనర్ ఆదేశించగా, శాఖధిపతులు సర్కిల్ ఆఫీసర్లు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ లో ప్రజల సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ పర్యటనలు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్, ఇంచార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.