Breaking News

వన్ కళ్యాణ్  మాత్రమే నిరుద్యోగ యువతకు న్యాయం చేయగలరు…

-పాదయాత్ర లో ముద్దులు కురిపించి…‌ నేడు పోలీసులు తో కొట్టిస్తారా…
-నిరుద్యోగ సంఘాలు చేసే ఆందోళనకు జనసేనపార్టీ మాత్రమే మద్దతు ప్రకటించింది…
-ప్రజలను మోసం చేసే విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ డైరెక్టర్ కార్యాలయ అధికారి సుబ్బారాజు కి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయ్ కుమార్, విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి .రామకృష్ణ , మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత, కృష్ణా జిల్లా నాయకులు పులిపాక ప్రకాష్, తాడిశెట్టి నరేష్ వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ శాంతియుతంగా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తుంటే అన్ని జిల్లాల్లో జనసేన నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం గృహ నిర్భందాలు చేయడం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని, జాబులు ఇస్తామని చెప్పి యువతతో ఓట్లు వేయించుకొని వారిని మోసం చేయడం దుర్మార్గమని, మీరు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నామని, ఎంతోమంది యువకులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే వారి ఆశలను అడియాశలు చేశారని, నిరుద్యోగ యువత శాంతియుతంగా చేసే ఉద్యమాన్ని అణిచి వేయాలని అనుకుంటే మీకు సరైన గుణపాఠం చెప్తారని, నిరుద్యోగ యువతకు జనసేన తరపున ఎప్పుడు మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నా, 2.30లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని జగన్ చెప్పడం వాస్తవం కాదఅని, ప్రతి యేడాది జాబ్ క్యాలెండర్‌ రిలీజ్ చేస్తామని చెప్పారని, ఇప్పుడు జాబ్ లెస్ క్యాలెండర్‌ ప్రకటించారని,ఇది అన్యాయం అంటే… అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, అధికారులు కూడా వినతి పత్రాలు తీసుకోవాలంటే భయపడుతున్నారని, పోలీసులతో అన్యాయంగా మా వారిని అరెస్టు చేయిస్తున్నారని,పాదయాత్ర లో ముద్దులు కురిపించి…‌నేడు పోలీసులు తో కొట్టేస్తున్న,ముప్పై లక్షల మంది జీవితాలను నాశనం చేస్తునరని, 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఆశగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెగా డీఎస్సీ నిర్వహించాలని గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పోస్టులు భర్తీ చేయాలని అవి ఎంతవరకు జనసేన పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని రాష్ట్రంలో ఒక్క జనసేన పార్టీని నిరుద్యోగ యువత గురించి ఉద్యమ ఇస్తుందని,నిన్న సిఎం నివాసం ముట్టడి తెలుసుకుని జగన్ పోలవరం పారిపోయారని,చంద్రబాబు చెప్పిన సోమవారం పోలవరం ను…‌జగన్ నిన్న అమలు చేసి చూపారని,అంటే… ప్రజలను మోసం చేసే విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరేనని,నిరుద్యోగులు కల సాకారం‌ చేసే వరకు జనసేన పోరాటం చేస్తుందని,విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు చేసే ఆందోళనకు జనసేన మద్దతు ఉంటుందని,మా నాయకులు పవన్ కళ్యాణ్, మనోహర్ లు నిరుద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని ప్రకటించారని మహేష్ తెలిపారు.

బండ్రెడ్డి .రామకృష్ణ జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఒక మాట.. అధికారం లోకి వచ్చాక మరో మాటఅని, మాయ మాటలతో 151సీట్లు తెచ్చుకుని.. ప్రజలను జగన్ మోసం చేశారని,హామీని అమలు చేయమంటే… అక్రమంగా మమ్మలను అరెస్టు చేస్తున్నారని, రెండున్నర లక్షల ఉద్యోగాల ను భర్తీ చేయాలని అన్నారు,

మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ మాట్లాడుతూ ఓట్లు కోసం నోటికొచ్చినట్లు జగన్ హామీలు ఇచ్చారని,అధికారం లోకి వచ్చాక అందరినీ నట్టేట ముంచారని,జగన్ మోసంతో నిరుద్యోగ యువత రగిలి పోతుందని,అందుకే స్వచ్ఛందంగా రోడ్ల పైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారని,వారి ఆగ్రహాన్ని పోలీసులు ను అడ్డం పెట్టి ఆపలేరని, జగన్ ఉద్యోగాలు ను భర్తీ చేసి మాట నిల బెట్టుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లింగం శివ ప్రసాద్, వెన్న శివ శంకర్, గంజి పవన్ ,బొలిశెట్టి వంశీ, మల్లెపు విజయలక్ష్మి ,గది రెడ్డి అమ్ములు, షేక్ అమీర్ భాష, దోమకొండ మేరి, బొమ్మ రాంబాబు , పూల దాస్ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *