Breaking News

న‌గ‌రాభివృద్దికి నిధులు కెటాయించండి…

-సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కోరిన మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దికి నిధులు కెటాయించాల‌ని ఏపి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తాడేప‌ల్లి క్యాంపు కార్యాయ‌లయంలో మేయ‌ర్  రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, వైసీపీ నాయ‌కులు రాయ‌న న‌రేంద్ర‌తో క‌లిసి కోర‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని, కోన్ని సాంకేతిక కార‌ణాల కార‌ణంగా విజ‌య‌వాడలో కొంత మందికి అంద‌ని అమ్మవోడి, పింఛ‌న్‌ల‌ను మంజూరు చేయ వ‌ల‌సింగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ల‌డంతో వారు సానుకూలంగా స్పందిచార‌ని, త‌ర్వ‌లో అర్హ‌లైన వారికి అమ్మబ‌డి, ఫించ‌న్ అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

మహిళా సాధికారత చరిత్రలో దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో అమ్మ ఒడి, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత వంటి పథకాలతో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ విప్లవాలకు ఏకకాలంలో శ్రీకారం చుట్టింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. ఈ తరం పిల్లలు ఎదిగిన తరవాత, రాబోయేకాలంలో అప్పటి ప్రపంచంలో ఎదుర్కోబోయే సవాళ్ళను దృష్టిలో ఉంచుకుని విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెపుతూ వార్డు/గ్రామ సెక్రెటేరియట్‌లను, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశాం. దాంతో గ్రామం మారింది. గ్రామ పరిపాలన మారింది. అవినీతి లేకుండా ప్రభుత్వం డబ్బు నేరుగా ప్రజలకు చేరుతోంద‌న్నారు. కోవిడ్‌ మహమ్మారి ఏడాదికి పైగా మనకు సవాలు విసిరినా, మన పేదలు బతకటానికి మన జగనన్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అయ్యాయి. ఒక్కపైసా అవినీతి లేకుండా 100 శాతం పూర్తిగా లబ్ధిదారునికి చేరే విధంగా, దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి పైసా ప్రజల అకౌంట్లలో జమ అవుతుంద‌న్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *