-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని, రీ ఓపెన్ కు తావు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో, వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీ జి ఆర్ ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి అని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డి ఆర్ ఓ నరసింహులు, తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు : రెవెన్యూ -94, టిడ్కో-1, పంచాయతీ రాజ్ -13, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్- 8, గృహనిర్మాణ శాఖ -2, పోలీసు శాఖ -8, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ -7, మెడికల్ అండ్ హెల్త్- 2, రవాణా శాఖ – 1, సెర్ఫ్ -2, పరిశ్రమలు-1, తుడ -1, విద్యుత్ శాఖ -1, ట్రైబల్ వెల్ఫేర్ -5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ -2, అటవీ శాఖ -1, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ – 1 వెరసి మొత్తం 150 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.