Breaking News

మీరు అయిదేళ్లలో చేయని అభివృద్ధి కేవలం 5 నెలల్లోచేశాం

-మంత్రులు సవిత, శ్రీనివాస్
-దమ్ముంటే చర్చకు రండి
-జగన్ కు మంత్రి సవిత సవాల్
-రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు : మంత్రి కొండపల్లి శ్రీనివాస్

పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ పాలన అంతా అప్పులమయమేనని, అయిదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధి మేం కేవలం 5 నెలల కాలంలోనే చేసి చూపించామని, చంద్రబాబు అంటేనే బ్రాండ్ అని, ఇందుకు రాష్ట్రానికి తరలొస్తున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులే నిదర్శమని మంత్రులు సవిత, కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తాము 5 నెలల కాలంలో చేసిన అభివృద్ధి చర్చకు సిద్ధమని జగన్ కు మంత్రి సవిత సవాల్ విసిరారు. గడిచిన 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంఎస్ఎంల ఏర్పాటుపై శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి పెనుకొండకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంక్షేమ సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన… రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. ముందుగా మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. ముఖ్యంగా యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో స్వయం ఉపాధి రుణాలు అందజేసి ఎంఎస్ఎంఈలు, యూనిట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపార వేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. జగన్ అయిదేళ్ల పాలన అంతా అప్పులమయమేనని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ అయిదేళ్ల కాలంలో చేయలేని అభివృద్ధిని సీఎం చంద్రబాబునాయుడు కేవలం 5 నెలల కాలంలోనే చేసి చూపించారన్నారు. సంక్షేమానికి కూడా ప్రాధాన్యమిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. అవ్వ తాతలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.6 వేల కు పెన్షన్లు పెంచామన్నారు. ఉచిత ఇసుకతో మహిళలకు మూడుగ్యాస్ సిలిండర్లు అందజేశామన్నారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్డు రద్దు చేశామని తెలిపారు.

చంద్రబాబు అంటేనే బ్రాండ్
రాయలసీమను పరిశ్రమల హబ్ ను రూపొందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు అంటనే ఓ బ్రాండ్ అని…ఆయన పరిపాలన దక్షత చూసి ఎందరో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని తెలిపారు. పెనుకొండలో ఏర్పాటు చేసి కియా పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. త్వరలో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసి యువతకు మరింత ఉపాధి కల్పించనున్నామని తెలిపారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వచ్చారని మంత్రి సవిత కొనియాడారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిన జగన్
గత అయిదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎఈ యూనిట్లు నెలకొల్పి, యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అవసరాలకనుగుణంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా వ్యాపారాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ ప్రాంత యువతకు, మహిళలకు మేలు చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం మంత్రులు సవితను, శ్రీనివాస్ ను కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *