అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా 2026-27 వరకు అమలు చేస్తున్నప్రధానమంత్రి సూర్య ఘర్:ముఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు పెద్దఎత్తున వినియోగించుకునేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఈమేరకు గురువారం ఢిల్లీ నుండి ఆయన దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు,జాతీయ రహదారుల నిర్మాణం,మినరల్ బ్లాకుల వేలం,ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన అమలుకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి మాట్లాడుతూ సోలార్ రూఫ్‌టాప్ సామర్థ్యంలో వాటాను పెంచడానికి మరియు నివాస గృహాలు వారి స్వంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సాధికారత కల్పించడానికి 29 ఫిబ్రవరి,2024న ప్రధాన మంత్రి సూర్య ఘర్:ముఫ్త్ బిజిలీ యోజనను భారత ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని రూ.75,021 కోట్ల వ్యయంతో 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ పథకాన్నిజాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (NPIA) మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (SIAలు)అమలు చేస్తాయని తెలిపారు.డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీ (డిస్కమ్‌లు లేదా పవర్,ఎనర్జీ డిపార్ట్‌మెంట్లు సందర్భానుసారంగా) రాష్ట్రం,యుటి స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (SIA)గా ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.ఈ పథకం కింద డిస్కమ్‌లు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్‌టాప్ సోలార్‌ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.ముఖ్యంగా నెట్ మీటర్ల లభ్యత సకాలంలో ఇన్‌స్టాలేషన్‌లను తనిఖీ చేయడం మరియు ప్రారంభించడం,వెండర్ రిజిస్ట్రేషన్ మరియు మేనేజ్‌మెంట్,సోలారైజింగ్ కోసం ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కన్వర్జెన్స్ వంటి అనేక సులభతరమైన అంశాలపై సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈపధకంపై ప్రజల్లో అవగాహన కల్పించి పెద్దఎత్తున ఈపధకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.
ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ఎలా పనిచేస్తుందంటే? 2kW సామర్థ్యం గల సిస్టమ్‌లకు సోలార్ యూనిట్ ధరలో 60% మరియు 2 నుండి 3kW సామర్థ్యం మధ్య సిస్టమ్‌లకు అదనపు సిస్టమ్ ఖర్చులో 40% సబ్సిడీని అందిస్తుంది.సబ్సిడీని 3 కిలోవాట్ల సామర్థ్యానికి పరిమితం చేశారు.ప్రస్తుత బెంచ్‌మార్క్ ధరల ప్రకారం, దీని అర్థం 1kW సిస్టమ్‌కు రూ.30,000,2kW సిస్టమ్‌లకు రూ. 60,000 మరియు 3kW లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్‌లకు రూ.78,000 సబ్సిడీ లభిస్తుంది.
సూర్యఘర్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు?
• దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి.
• సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి ఉండాలి.
• ఇంటికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
• సౌర ఫలకాల కోసం గృహస్థులు మరే ఇతర సబ్సిడీని పొంది ఉండకూడదు.
పియం సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా,ఆసక్తిగల వినియోగదారు జాతీయ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి .రాష్ట్రాన్ని మరియు విద్యుత్ పంపిణీ సంస్థను ఎంచుకోవడం ద్వారా ఇది జరగాలి.నేషనల్ పోర్టల్ తగిన సిస్టమ్ సైజులు,బెనిఫిట్స్ కాలిక్యులేటర్,వెండర్ రేటింగ్ మొదలైన సంబంధిత సమాచారాన్ని అందించడం ద్వారా గృహాలకు సహాయం చేస్తుంది.వినియోగదారులు తాము ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటున్న రూఫ్ టాప్ సోలార్ యూనిట్‌ను వెండర్‌ను ఎంచుకోవచ్చు.
ఈవీడియో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ హైదరాబాదు నుండి వర్చువల్ గా పాల్గొన్నారు.అమరావతి రాష్ట్ర సచివాలయం నుండి ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్,టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కాంతి లాల్ దండే,ఆర్ధికశాఖ కార్యదర్శి జానకి,గనుల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …