Breaking News

ఘనంగా శారద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

-వెయ్యి మందికి పైగా పాల్గొన్న పూర్వ విద్యార్థులు
-పూర్వ అధ్యాపకులకు సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని స‌త్య‌నారాయ‌ణ‌పురంలోని శారదా క‌ళాశాల‌ స్వర్ణోత్సవ వేడుకలు, నాటి, నేటి విద్యార్థుల సమ్మేళనం ఉత్సాహ భరితంగా జరిగింది. శారద కళాశాల ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థులు, పూర్వ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. గత యాభై ఏళ్ళ లో చదువుకున్న విద్యార్థులు నేడు ఎంతో మంది ఉన్నత స్థానంలో ఉన్నారు. వారంతా తాము చదువుకున్న కళాశాలకు వచ్చి ఒక్కసారిగా తమ కళాశాల మధుర స్మృతులను నరువేసుకున్నారు. ఏరా రాజేష్… ఎలవున్నావు…హై శివా… అంటూ ఒకరినొకరు పలుకరించుకుంటూ ఆప్యాయతను పంచుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చిన్నపిల్లల మాదిరిగా జోక్ లు వేసుకుంటూ ఆదివారం రోజంతా ఉల్లాసంగా గడిపారు. సాయంత్రం5 గంటల వరకు ఉల్లాసంగా గడిపి ఒక్కసారిగా తమ కళాశాలను వెడుతున్నమనే భావనతో బాధపడుతూ వెళ్ళారు. అంతకు ముందు జరిగిన ప్రారంభ సమావేశంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సి.ఎ. కుండా రామ నారాయణ అధ్వర్యంలో. కళాశాల పూర్వ అధ్యాపకులు సుమారు 200 మందిని ఘనంగా సత్కరించారు. అలాగే విద్యార్థులకు కూడా 50 ఏళ్ల గుర్తుగా జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి సి. ఎ.రామ నారాయణ మాట్లాడుతూ శారద కళాశాల గోల్డెన్ జూబిలీ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశానికి పెద్ద స్థాయిలో స్పందన వచ్చిందని అన్నారు. వెయ్యి మందికి పైగా పూర్వ విద్యార్థులు 200 మందికి పైగా స్టాఫ్ పాల్గొన్నారని అన్నారు. శారద కళాశాల 1974 లో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభమైందని అన్నారు. తొలుత అద్దె భవనంలో ప్రారంభమైందని తరువాత ఆధునిక వసతులతో కూడిన భవనాన్ని ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నేడు డిగ్రీలో ప్రస్తుతం విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులను ప్రారంభిస్తూ విద్యార్థులకు చక్కటి విద్య అందిస్తున్నామని తెలిపారు. కోర్సు పూర్తయ్యేలా ఉపాది అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో క్యాంపస్ ప్లేస్ మెంట్ సెల్ ప్రారంభించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. రానున్న కాలంలో విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించి విద్యను అందిస్తామని తెలిపారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల కూడా పలు పంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ఆర్. డి.షా, ఉపాధ్యక్షులు లింగ మూర్తి, శారద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నాగేశ్వర శర్మ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.శ్రీధర్, శారద స్కూల్ ప్రిన్సిపాల్ ఎ. ఎల్. ఎన్.మూర్తి, సొసైటీ ట్రెజరర్ ఎస్. వి. ఎన్. వర ప్రసాద్ . సొసైటీ సభ్యులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *