విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ప్రతీ సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం మరియు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమమును పున:ప్రారంభించుట జరుగుతుందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటన ద్వారా తెలియజేసారు. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజలకు మౌలిక సదుపాయల కల్పనలో ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకొనుటకు ది.26.07.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మద్యాహ్నం 1.00 గంట వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్, కమిషనర్ మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో జోనల్ కమిషనర్ల అధ్యక్షతన “స్పందన ” కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. నగర ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆర్జీలను తమ యొక్క అధార్ గుర్తింపు నకలు జతపరచి నేరుగా ప్రధాన కార్యాలయంలో మేయర్, కమిషనర్ కు, లేదా సర్కిల్ కార్యాలయాల్లో జోనల్ కమీషనర్లకు ప్రజలు వారి సమస్యలను వివరించడం ద్వారా సమస్య పరిష్కారించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశమును ప్రజలందరూ సద్వినియోగపరచుకొనవలసినదిగా కోరారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …