-నో మాస్ నో రైడ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోన థర్డ్ వేవ్ హెచ్చరికలు మేరకు పలుమార్లు ఆటోడ్రైవర్లకు ప్రజలకు క్షేత్రస్థాయిలో డిటిసి ఆధ్వర్యంలో తనిఖీల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ జె నివాస్ తెలిపారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారంనాడు ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా చేపట్టిన వివరాలను స్థానిక డిటిసి కార్యాలయం నుండి విడుదల చేశారు. ఈ సందర్భంగా డిటిసి యం పురేంద్ర మాట్లాడుతూ కరోన వ్యాధి నివారణలో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి పలుమార్లుతనిఖీల ద్వారా అవగాహన కార్యక్రమాలు చెయ్యడం జరిగిందని, కానీ కొంతమంది డ్రైవర్లలో మార్పు రావడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటించినప్పుడే కరోన బారిన పడకుండా ఉండగలుగుతారని అయన తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించని డ్రైవర్లకు మరెంత అవగాహన పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా 18 బృందాలను ఏర్పాటుచేసి ప్రత్యేక తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు. నగరంలో బందర్ రోడ్డు, బెంజ్ సర్కిల్, ఆటోనగర్, సత్యనారాయణపురం, సింగినగర్, ఏలూరు రోడ్డు, రామవరప్పాడు జంక్షన్, పోరంకి, పెనమలూరులలో 9 బృందాలతో విస్తృత తనిఖీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 164 ఆటోలను నిర్బంధించి అదేనంలో ఉంచుకొని, ఆటో డ్రైవర్లకు యజమానులకు కోవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించి నిర్బంధించిన ఆటోలను సాయంకాలం విడుదల చేయడం జరిగిందన్నారు. మార్గదర్శకాలు అధిగమించిన ఆటోడ్రైవర్ల లు మాస్కు ధరించకపోవడం ఎక్కువ మంది ప్రయాణికులను ఆటోలలో ఎక్కించుకోవడం వంటివి పరోక్షంగా కరోన వ్యాధి వ్యాప్తి చెందడానికి దోహదం చేసినట్లేనని చెప్పడం జరిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కు ధరించని ప్రయాణికులను వాహనాలలో ఎక్కించవద్దని సూచించామన్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు మీరు పాటించడమే కాకుండా ఇతరులు కూడా మార్గదర్శకాలు పాటించేలా డ్రైవర్లు బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని కోవిడ్ మార్గదర్శకాల మేరకు మాస్క్ ధరించని వారిపై చర్యలు తీసుకుంటామని డి టి సి పురేంద్ర హెచ్చరించారు.