విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురుపౌర్ణమి సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలలో పాల్గొని, కరోనా రాష్ట్రం నుండి పూర్తిగా తొలగిపోవాలని, ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, వారి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనే లాగా సాయిబాబా దీవెనలు అందించాలని, మహేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దూది ఫ్యాక్టరీ వీధిలో గల సాయిబాబా మందిరాన్ని మొదటగా సందర్శించిన్నారు, మహేష్ కి హరిబాబు శాలువాతో సత్కరించారు, అనంతరం పాండురంగ స్వామి ఆలయంలో గల సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల నన్నే సాహెబ్ వీధిలో పోతిన వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గురుపౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నప్రసాద వితరణ చేసినారు.
