Breaking News

ముగిసిన సర్పంచ్ ల శిక్షణా తరగతులు….!!!

-మొదటి దశలో 9 మండలాల సర్పంచులు గ్రామ పరిపాలన విధానాలపై శిక్షణ….!!
-మొదటి దశ ముగింపు సభలో సర్పంచ్ లకు పాలన విధానాలపై అవగాహన కల్పించిన జడ్పీ సీఈవో సూర్య ప్రకాష్….!!!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ డివిజన్ పరిధిలోని 14 మండలాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్పంచ్ ల శిక్షణా తరగతులు ఇబ్రహీంపట్నం నీమ్రా ఇంజినీరింగ్ కాలేజ్ వేదికగా జరుగుతున్నాయి.. మొదటి దశలో 9 మండలాల కు గానూ మొత్తం గ్రామ సర్పంచ్ లకు గ్రామ పరిపాలన విధానాలపై శిక్షణా ఇచ్చారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమం నేటితో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ సీఈవో పి.సూర్య ప్రకాష్ సర్పంచుల విధి విధానాలు, పాలనా భాధ్యత లపై అవగాహన కల్పించారు. శిక్షణ అనంతరం సర్పంచ్ లకు శిక్షణా ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధి శాఖ అధికారి ఆర్.దివాకర్ , పంచాయితీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *