ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున శాకంభరీ ఉత్సవములలో మూడవ రోజు (చివరి రోజు) శనివారం శాకాంబరీ దేవి రూపంలో వున్న అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.జె.పి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తదితర ప్రముఖులు కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు డి.వి.ఆర్.కె.ప్రసాద్ స్వాగతం పలికి శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా పాలకమండలి శ్రీఅమ్మవారి ప్రసాదములు, చిత్రపటంను అందజేసారు.
Tags indrakiladri
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …