విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులకు సంబంధించి స్పందన దరఖాస్తులను తమ దగ్గరలోని గ్రామ సచివాలయాలలో అందించాలని సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పందన కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై స్పందన దరఖాస్తులను విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంనకు వచ్చి ఇచ్చినా, వారి దగ్గరలోని గ్రామ/వార్డ్ సచివాలయంలో అందించినా పరిష్కార విధానం ఒకేవిధంగా ఉంటుందని, దరఖాస్తును పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు ఆన్లైన్ ద్వారా పంపడం జరుగుతుందన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో డివిజన్ లోని వివిధ మండలాల నుండి వ్యయప్రయాసలకోర్చి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంనకు వచ్చి డబ్బు, సమయాన్ని వృధా చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. గ్రామ/వార్డ్ సచివాలయాలలో అందించిన స్పందన దరఖాస్తులకు తప్పనిసరిగా అకనాలెడ్జిమెంట్ తీసుకోవాలని, అప్పుడే దరఖాస్తు ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. అత్యవసరం, అతిముఖ్యమైన సమస్యలతో బాధపడుతున్న సీనియర్ సిటిజెన్స్ మాత్రమే విజయవాడ లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తమ దరఖాస్తులు అందించాలని ఆయన సూచించారు.
Tags vijayawada
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …