-బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు మహిళలకు నగర కమిటీ లో ప్రాధాన్యత కల్పించినందుకు అధ్యక్షలు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు…
-జీవో నెంబర్ 198 కౌన్సిల్లో ఆమోదించడం చారిత్రాత్మక తప్పిదం…
-వైయస్సార్ సిపి కి ఓటేసిన విజయవాడ నగర ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా పన్ను వెన్ను పోటు ను వైఎస్ఆర్సిపి అందజేసింది…
-విజయవాడకు నిన్న చీకటి రోజు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ వారి కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ మరియు మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించి 68 శాతానికిపైగా పదవులను నగర కమిటీలో ప్రాధాన్యత కల్పించి నందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలుతెలియజేస్తున్నాముఅని, అదేవిధంగాఇందుకు సహకరించిన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలుతెలుపుతున్నామని, నగర కమిటీ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించామని, రాబోయే రోజుల్లోనగర సమస్యలపై ప్రజల తరఫున జనసేన పార్టీ బలమైన గొంతుక వినిపిస్తుందని, అతి తొందర్లోనేతేదీ ఖరారు చేసి నగర కమిటీ తోపాటు నగర అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తామని మహేష్తెలియజేశారు.అనంతరం మాట్లాడుతూ నిన్న విజయవాడ కౌన్సిల్ లో జీవో నెంబర్ 198 ఆమోదించడం అంటే విజయవాడ నగరానికి చీకటిరోజని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బహుమానంగా రిటర్న్ గిఫ్ట్ గా వై ఎస్ ఆర్ సి పిపార్టీ కార్పొరేటర్లు, మేయర్, మంత్రి మరియు ఎమ్మెల్యే ప్రజలకు పన్నువెన్నుపోటు పొడిచారని, ఒక్కరంటేఒక్క వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ కూడా పన్నుల పెంపును వ్యతిరేకించ కపోవడం దుర్మార్గమని, మేయర్ గారు.పన్నుల పెంపు 15 శాతం వరకు అవకాశం ఉన్న తాము కేవలం 13 శాతం మాత్రమే పెంచుతున్నామని మాట్లాడ్డంప్రజలను వంచించడం కాదా అని, 40 గజాలు ఉన్న ఇంటికి కేవలం 50 రూపాయలు మాత్రమే పన్ను విధిస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని, చెత్తపన్ను నెలకు150 రూపాయలు, నీటిపన్నునెలకు 180 రూపాయలుసాధారణ ప్రజల దగ్గర వసూలు చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం 50 రూపాయల పన్ను విధిస్తుంది అంటే ఎవరైనానమ్ముతారాని, ఇలా అబద్ధాలుచెప్తుంటే మరో పక్కన కౌన్సిల్లో కమిషనర్ గారు పన్నులను జీవో నెంబర్ 198 ద్వారా ఆస్తి విలువ ఆధారంగానే విధిస్తామనితెలియజేయడం మేయర్ గారు వైఎస్ఆర్సిపి పార్టీ కార్పొరేటర్ల ప్రకటన ఇది విరుద్ధంగా ఉన్నవిషయం నగర ప్రజలు గ్రహిస్తున్నారని, రాబోయే రోజుల్లో పన్నులు 10 రెట్లు పెరగడం ఖాయమని, ఇప్పటికైనా వైఎస్ఆర్సిపికార్పొరేటర్లు చేస్తున్న మోసాన్ని నగర ప్రజలుగ్రహించాలని ,రాబోయే రోజుల్లో ఈ పార్టీకి బుద్ధి చెప్పాలని, కౌన్సిల్లో ప్రతిపక్షాలు Go no.198 పై మాట్లాడేందుకు కేవలం మూడు నిమిషాలుసమయం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని, దమ్ముంటే ఎవరైనా వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు, మేయర్ గారు , మంత్రి గారు ఎవరైనా సరే జీవో నెంబర్ 198 ను 30 నిమిషాల్లో చదివి అందరికీ అర్థమయ్యేరీతిలో వినిపించాలని సవాల్ విసిరారు. ఓట్లేసినందుకు వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ల ప్రజలుకు పన్నులు పెంచి చెంప ఛెళ్లుమనిపించి రుణంతీర్చుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో బొలిశెట్టి .వంశీకృష్ణ, మరియు నగర ఉపాధ్యక్షులు వెన్న .శివశంకర్, కామల.సోమనాథం, ప్రధాన కార్యదర్శి జి .నాగేష్, కార్యదర్శులు పాల .రజిని ,ఆలియా బేగం, సంయుక్త కార్యదర్శులు సాబింకర్. నరేష్, ఉప్పలపాటి. చాణిక్య, సాయి కిరణ్ నాయక్, రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.