మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కెడీసీసీబీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారనే నమ్మకం నూతన చైర్మన్ తన్నీరు నాగేశ్వరావుపై ఉందనీ రాష్ట్ర సమా చార, రవాణా, శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిలు విశ్వాసం వ్యక్తం చేశారు. సహకార కేంద్ర బ్యాంక్ ,కృష్ణా జిల్లా చైర్మన్ గా మచిలీపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం తన్నీరు నాగేశ్వరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుణ సౌకర్యం విస్తృత పర్చుతానని కౌలు రైతులకు, విద్యార్థులకు సేవలు చేస్తానని తన్నీరు నాగేశ్వరావు అన్నారు. బ్యాంక్ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ, బ్యాంక్ అభివృద్ధి కి కృషిచేస్తానని అన్నారు. బ్యాంకు టర్నోవర్ 7 వేల 150 కోట్ల రూపాయల నుంచి 10 వేల కోట్ల టర్నోవర్ కు పెంచేందుకు కృషి చేస్తానని అన్నారు. మిగతా వాణిజ్య బ్యాంకులకు మాదిరిగా కాక కె డి.సి.ఈ.బి 6 శాతం వడ్డీ ఇస్తుందని తెలిపారు. జిల్లాలోని 58 శాఖలలో పురోభివృద్ధి కనబర్చేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తన మీద పెట్టిన బృహత్తర బాధ్యత, సక్రమంగా నిర్వహించి బ్యాంక్ పురోభివృద్ధి కి పాటుపడతానన్నారు. త్వరలో 100 పోస్టులకు గాను ఆగస్ట్ 2,3 తేదీల్లో పారదర్శకంగా నిర్వహిస్తామని, దళారుల మోసపూరిత మాటలు నమ్మవద్దని, నాగేశ్వర రావు అన్నారు. కెడీసీసీబీ ద్వారా రైతాంగానికి పెద్ద ఎత్తున రుణ సదుపాయం కల్పిస్తానన్నారు. అవినీతి ఆరోణలు ఉన్న ఎవరినయినా ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాత పరీక్షలలో ఉత్హెర్ణులైన 28 మందికి మాత్రమే బోర్డ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, మిగిలిన పోస్టులు రాత పరీక్ష ఆధారంగా సెలెక్ట్ చేస్తామని, అన్నారు. జిల్లాలోని మంత్రుల, శాసన సభ్యులు సహకారం తో, బ్యాంక్ పురోభివృద్ధికి పాటుపడతామని, డిపాజిట్లు సేకరణ, లోన్స్ ఇవ్వడం చేస్తామని, 10 వేల రూపాయల నుండి నుండి 40 లక్షల వరకు రుణాలు ఇస్తామని, విద్యా రుణాలు, రైతులకు కర్షక మిత్ర లోన్లు ఇస్తామని, సహకార వ్యవస్థని పటిష్టం చేస్తామని, అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమా చార, రవాణా, శాఖా మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు పాల్గొని, చైర్మన్ నాగేశ్వర రావు ని అభినందించారు.
Tags machilipatnam
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …