విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్తం లభించక రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాణం పోకూడదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మొగల్రాజుపురంలోని జమ్మిచెట్టు సెంటర్ వద్ద నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి 65 సంవత్సరాల వరకూ రక్తాన్ని దానం చేయవచ్చని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 3 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని వివరించారు. రక్తదానం చేయడం వల్ల దానం చేసినవారికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయని, గుండెపోటు రాదని, బీపీ నియంత్రణలో వుంటుందన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా నెలరోజుల తర్వాత రక్తదానం చేయవచ్చన్నారు. కరోనా టీకా తీసుకున్న వారు సైతం నెల తర్వాత రక్తదానం చేయవచ్చని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్ట్ జడ్జి పార్థసారథి, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ జ్యోతిఈశ్వర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చెన్నుపాటి శ్రీనివాస్, మంగళంపల్లి హుస్సేన్, అడ్వకేట్ శ్రీమతి రాధిక శ్రీధరణ్ మరియు తెలుగు రాష్ట్రాల సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …