-డివిజన్ లో 1.79 శాతానికి తగ్గిన పాజిటివిటీ…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, గుడివాడ డివిజన్లో సోమవారం ఒక్కరోజే 1,393 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ లోని తొమ్మిది మండలాల్లో కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ రూరల్ మండలంలో 139 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, వీరిలో 9 మందికి కరోనా వైరస్ సోకిందన్నారు. గుడివాడ పట్టణంలో 255 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో ఏడుగురికి, పామర్రు మండలంలో 334 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో మరో ఏడుగురికి, పెదపారుపూడి మండలంలో 99 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా వైరస్ సోకిందన్నారు. గుడ్లవల్లేరు మండలంలో 91 మందికి, కైకలూరు మండలంలో 99 మందికి, కలిదిండి మండలంలో 97 మందికి, మండవల్లి మండలంలో 35 మందికి, ముదినేపల్లి మండలంలో 161 మందికి, నందివాడ మండలంలో 83 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికీ వైరస్ సోకలేదని చెప్పారు. డివిజన్ లో కరోనా పాజిటివిటీ రేటు 1.79 శాతంగా నమోదైందని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయన్నారు. ప్రస్తుతం 21 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రికవరీ రేటు 98.25 శాతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువ ఉందని చెప్పారు. మరో మూడు జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉందన్నారు. ఒక జిల్లాలో మాత్రమే 5 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉందని మంత్రి కొడాలి నాని తెలిపారు.