-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంక్షేమం కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందించి అమలు చేస్తూ.. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఏ సమస్యను ఎదుర్కోకుండా చెయ్యడానికి కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమం “రైతు స్పందన” కార్యక్రమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ మీటింగ్ హాల్ లో జరిగిన రైతు స్పందన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రా,ష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో రైతులకు సమస్యలు ఉండకూడదని, ప్రతి నెల మొదటి, మూడవ, బుధవారాలలో ప్రతి మండలంలో రైతు స్పందన కార్యక్రమం నేటి నుంచి జిల్లా లో శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. గ్రామాలలో రైతులకు వున్న ఇబ్బందులపై సంబంధిత అధికారులకు అర్జీలు ఇస్తే, ఆ యొక్క సమస్యను అధికారులు త్వరగతిన పరిష్కారం చూపుతారని అన్నారు.గౌరవ ముఖ్యమంత్రి వైఎస్. జగనన్న రాష్ట్రంలో రైతుల కోసం, అనేక పధకాలు ప్రవేశపెట్టి, రైతు కంటిలో ఆనందం చూడాలని కోరుకుంటున్నారన్నారు. అలాగే ఆర్బీకే ల్లో బ్యాంకు సౌకర్యం కూడా రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారని, .ఇది చాలా అభినందనీయం అన్నారు.దీనివల్ల గ్రామాల్లో ప్రజలకు సమయం కలిసి రావడంతోపాటు ప్రయాణ ఖర్చులు ఉండవని అన్నారు. అదే విధంగా ఈ రైతు స్పందన కార్యక్రమంలో వ్యవసాయానికి అనుసంధానమై ఉన్న అన్ని శాఖల అధికారులు హాజరై రైతులు ఇచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కారం చేస్తారని అన్నారు. రైతులు ఈ అవకాశం చక్కగా వినియోగించుకుని ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలోవ్యవసాయ శాఖ ఏడీ గంగాధరరావు,ఫిషెరీస్ ఏడీ లాబ్ వర్ధన్,ఎంపీడీఓ వెంకటరత్నం, తాహశీల్దార్ సాయి కృష్ణ కుమారి,ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మహ్మద్ జహీర్,వేంకటేశ్వరస్వామి గుడి చైర్మన్, భాస్కర వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు అబ్దుల్ హమీద్, నిమ్మల సాయిబాబు, కాకర్ల శ్రీనివాసరావు,, బూర్ల నాగరాజు, జాజుల రాజు, సన్నిధి కృష్ణ,, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.