కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని సచివాలయం ను విజయవాడ సబ్ కలెక్టర్ జి.సాయి సూర్య ప్రవీణ్ చంద్ పరిశీలించారు. రెవెన్యూ అధికారులను సచివాలయం సిబ్బందిని మండలంలోని గ్రామాలలోని జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల గురించి, ఫీవర్, కోవిడ్ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోగల అభివృద్ధి కార్యక్రమాల గురించి పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగిందని ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పరిటాల గ్రామంలో గల లే అవుట్ లో ఇళ్ల నిర్మాణ పనులు టేస్ మట్టం వరకు 90% వరకు జరుగుతున్నాయని అన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక, ఐరన్, సిమెంట్ అందే విధంగా చూస్తామన్నారు. త్వరగా నిర్మాణం జరిగేందుకు ఎం ఆర్ ఓ ఎండి ఓ తో పాటు మిగతా అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. హౌసింగ్ సిబ్బంది చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారని అన్నారు. కోవిడ్ కేసులు పెరిగాయన్నారు. విజయవాడ డివిజన్లో ఫీవర్ సర్వే లో కొత్త లక్షణాలతో (దగ్గు జలుబు జ్వరం) 710 కేసులు వచ్చాయన్నారు. వీళ్ళ ను టెస్ట్ చేస్తే 150 నుంచి 200 వరకు పాజిటివ్ లు వచ్చాయని అన్నారు. అందరినీ అప్రమత్తం చేసేందుకు మండల లెవెల్ లో జాయింట్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల లెవెల్ లో ఎండి ఓ ఎం ఆర్ ఓ ఎస్ హెచ్ ఓ ముగ్గుర్నీ కలిపి జాయింట్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో కూడా జాయిన్ టీమ్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సచివాలయాల్లో ముఖ్యమంత్రి చేపట్టిన పథకాల గురించి అందరికీ అర్థమయ్యే విధంగా డిస్సేస్ చాలా చక్కగా ఏర్పాటు చేశారని అధికారులను అభినందించారు ఈ కార్యక్రమంలో కంచికచర్ల తహసిల్దార్ వి రాజకుమారి, మండల అభివృద్ధి అధికారిణీ కే శిల్ప, ఆర్ ఐ శిరీష, కంచికచర్ల ఎస్సై సుబ్రహ్మణ్యం, కంచికచర్ల గ్రామ కార్యదర్శి కనగాల రవికుమార్, పరిటాల గ్రామ కార్యదర్శి పోసాని అనిల్ కుమార్ ,హౌసింగ్ ఏఈ నరసింహారావు, పరిటాల వీఆర్వోలు సురేష్, శ్రీలక్ష్మి మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags kanchakacherla
Check Also
ప్రజాభిప్రాయానికి తగ్గట్టే రాష్ట్రంలో పాలన
-అధికారులు తమ పనితీరుతో మెప్పించాలి -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాభిప్రాయానికి పెద్దపీట …