-పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్…
– పులిచింతల గేటు సాంకేతిక సమస్యలపై నిపుణులతో కమిటీ వేసి నివేదిక తెప్పిస్తాం…
-ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వ యంత్రం…
విజయవాడ, జగ్గయ్య పేట, నేటి పత్రిక ప్రజావార్త :
పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి గేటు విరిగిపోయిన ప్రదేశాన్ని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. వీరితో పాటు పభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ జె.నివాస్ కూడా ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ప్రాధమిక సమాచారాన్ని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గేటు మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి తక్షణ చర్యలు చేపట్టినట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అదే విధంగా ప్రాజెక్టు దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశామన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నమన్నారు. పులిచింత ప్రాజెక్టు గేటు విరిగిపోయిన ప్రాంతంలో తక్షణ మరమ్మత్తులు చేపట్టేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. అదే విధంగా మరో వైపు వరద ఉదృతి తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి కూడా నిపుణులు రావడం జరుగుతుందన్నారు. శుక్రవారం సాయంత్రానికి మరమ్మత్తులు పూర్తి కావచ్చనని అధికారులు అంచన వేస్తున్నరన్నారు. గేట్లు ఎత్తే సమయంలో హైడ్రాలిక్ గడ్డర్ విరిగి గురువారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ఇంజనీర్లు, ఇంజనీరింగ్ నిపుణుల బృందాలు పరిశీలించాయన్నారు. సుమారు 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుందన్నారు. తప్పని పరిస్థితుల్లో దిగువకు నీటిని విడుదల చేస్తున్నమన్నారు. స్టాప్ లాక్ గేట్లను పెట్టలన్నా నీటిని కిందకు విడుదల చేయాల్సి వుంటుందన్నారు. విరిగి పడిన గేటు స్థానంలో స్టాఫ్లేక్ గేటును దించే సమయంలో మళ్లి నీటి ఉదృతి ఎక్కువగా ఉంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం వుందన్నారు. అవసరమైతే 5 నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి వేయవల్సి వస్తుందన్నారు. ఇందు కోసం అధికారులను కూడా సన్నద్ధం చేశామన్నారు. ప్రాజెక్టుల్లో నీళు 10 టీఎంసీలకు తగ్గాకే మరమ్మత్తులు చేపట్టే అవకాశం వుందన్నారు. గేటు మరమ్మత్తు నిమిత్తం నీటిని దిగువకు వదిలిన రానున్న రోజుల్లో వర్షాలు పడి వరద నీరు వచ్చే అవకాశం వుంటుందన్నారు. అప్పుడు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదాయభాను మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామన్నారు. వీరి వెంట జిల్లా కలెక్టర్ జె.నివాస్, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పులిచింతల ఎక్లె రమేష్ బాబు, ఇఇ శ్యామ్ ప్రసాద్ డిఇఇ సుధాకర్, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు