Breaking News

ప్రశాంత వాతావరణంలో డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రారంభం…

-డిఆర్ వో యం. వెంకటేశ్వర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రశాంత వాతావరణ ప్రారంభమయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి యం.వెంకటేశ్వర్లు చెప్పారు. శుక్రవారం గొల్లపూడిలోని శిరీష ఇన్పో టెక్నాలజీలో నిర్వహిస్తున్న డిపార్ట్మెంటల్ పరీక్షలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్ వో యం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శుక్రవారం ప్రారంభమైన డిపార్ట్ మెంటల్ పరీక్షలు ఈ నెల 13 తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు సుమారు 11,128 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఉదయం 10:00 గంటల నుంచి 12:00 గంటల వరకు మరియు మధ్యాహ్నాం 3:00 గంటల నుంచి 5:00 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. పరీక్షలు అలైన్ పద్ధతిలో జరుగుతాయన్నారు.
జిల్లాలోని 10 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడతయన్నారు. తిరువూరు, గుడ్లవలేర్లు, పెడన ప్రాంతాలతో పాటు విజయవాడ నగరంలోని 7 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. గొల్లపూడిలోని పరీక్ష కేంద్రంలో 160 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 152 మాత్రమే మంది హాజరైయ్యారని ఆయన తెలిపారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *