Breaking News

“ఫ్రైడే డ్రైడే” కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత… మన ఆరోగ్యం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ఫ్రైడే డ్రై డే” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక దుర్గాపురంలోని 197వ సచివాలయం 27వ వార్డ్ పరిధి పరిసర ప్రాంతాలలో హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే, నీటినిల్వల ప్రదేశాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. కొన్ని చోట్ల నీరు నీరునిల్వ ఉంచిన బకెట్లలో దోమలార్వాను గుర్తించి, నీటిని పారవేయటం జరిగింది. ఉపయోగించని రుబ్బు రాళ్ళలో నీరు తీయించటం జరిగినది. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తెలియచేయటం జరిగింది. డెంగ్యూ వ్యాధి దోమకాటువల్ల జ్వరం వస్తుందని, జ్వరంతో కూడిన కాళ్లనొప్పులు, కండరాల నొప్పులు వుంటాయని, ఇది ఆడ ఈడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుందని, ఈ దోమపై తెల్లని చారలు వుంటాయని, ఈ దోమను టైగర్ దోమ అని అంటారని తెలియచేసారు. ఈ దోమలు పగటిపూట కుడతాయని ఎక్కువ మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని తెలియచేసారు. డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్ట్ ఆయన దోమ కుట్టిన తరువాత 3 నుండి 14 రోజుల్లో జ్వరం వస్తుంది అని తెలియజేశారు. అదేవిధంగా ఈ సీజన్లో మలేరియా బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇది ఆడ  అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా జ్వరం వస్తుందని తెలియజేశారు.  రోజు విడిచి రోజు చలి జ్వరం వస్తుందని, కండరాల నొప్పి వాంతులు అవుతాయని తెలియజేశారు. కావున ఈ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని, నీటిని మూతలు లేకుండా నిల్వ చేయరాదని, పూల కుండీలు కింద నీరు చేరకుండా చూడాలని, కొబ్బరిచిప్పలలో వర్షంనీరు చేరకుండా చూడాలని, విరిగిన కుండలు  మొదలగు వాటిలో నీరు చేరటం వల్ల దోమలు వృద్ధి చెందుతాయని సూచించారు. ఇంటిలో నీరు నిల్వ ఉండవలసి వస్తే తప్పనిసరిగా మూత పెట్టి ఉంచాలి అని వారానికొకసారి నిల్వ ఉంచిన నీరు పారబోసి కొద్దిసేపు ఎండాలని తెలియజేశారు. డెంగ్యూ లేదా మలేరియా అని అనుమానం వచ్చిన వెంటనే ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా ఆఫీస్ నందు రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి. మలేరియా హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావుతో పాటు హెల్త్ అసిస్టెంట్ జి.రమేష్, హెల్త్ సెక్రటరీ బి.హేమ, ఆశా వర్కర్ డి.లలిత, మరియు శానిటరీ సెక్రటరీ బి.రఘు తదితరులు పాల్గొన్నారు.

 

 

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *