-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
కలిదిండి డా.వై.ఎస్.ఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణం కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2008 సంవత్సరం లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలిదిండి కి ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయగా రెండు ప్రధాన కోర్సులతో కళాశాల ప్రారంభించబడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో క్లాసులు అద్దె భవనాల్లో వసతి సౌకర్యాలతో కొనసాగుతూ ఉందన్నారు. శాశ్వత భవన నిర్మాణాలకోసం 5 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటుగా రూ.8 కోట్ల అంచనాలతో భవనాల నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, అయితే ఆ మహానేత దివంగతులైన కారణంగా ఆ పనులు ప్రారంభం కాకపోవడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దీనికి తోడు కళాశాల రద్దు దిశగా ప్రయత్నాలు జరిగిందన్నారు. అయితే రాష్ట్రప్రజల సంపూర్ణ ఆశీర్వాదాలతో రాష్ట్రంలో మముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరడంతో కళాశాల యొక్క ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని వెంటనే తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పనులు ప్రారంభించడానికి తిరిగి అనుమతిని తీసుకోవడం జరిగిందని అన్నారు. దరిమిలా తాను గత సంవత్సరం జనవరిలో భూమిపూజ చెయ్యడం జరిగిందన్నారు.అయితే రాష్ట్రంలో మంజూరైన ఇతర పాలిటెక్నిక్ లతో కలిపి ప్యాకేజ్ గా టెండర్లు పిలవడం మూలాన ఆలస్యం అవుతున్న దశలో మరోమారు ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకునివెళ్లగా వారు వెంటనే పనులు మొదలు పెట్టమని ఆదేశాలు ఇచ్చియున్నారన్నారు. ఇటీవల సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ వారిని కలిసి వెంటనే పనులు మొదలు పెట్టవలసినదిగా కోరగా వారు ఈ మేరకు ఈ నెల 3 వ తేదీన స్వయంగా కలిదిండి వచ్చి పరిశీలన చేసి వెళ్లారని ముందుగా ప్రహరీగోడ నిర్మించి, భవనాల నిర్మాణం చేపట్టి ముందుకు వెళ్ళవలసినదిగా సంబంధిత ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు నిన్న విడుదల చేసిందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఆ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే నిర్మాణాలు ప్రారంభం అవుతాయని, కైకలూరు ప్రాంత విద్యాభివృద్ధికి బాటను వేసిన ముఖ్యమంత్రి జగనన్నకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు ఎమ్మెల్యే డిఎన్ఆర్ తెలిపారు.