Breaking News

గుడివాడ డివిజన్లో 974 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు…

-1.23 శాతానికి తగ్గిన కోవిడ్ -19 పాజిటివిటీ
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ డివిజన్ లో శనివారం ఒక్కరోజే 974 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీ శాతంపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నందివాడ మండలంలో 12 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి వైరస్ సోకిందని తెలిపారు. ముదినేపల్లి మండలంలో 85 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా వైరస్ సోకిందని చెప్పారు. పామర్రు మండలంలో 219 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో ఐదుగురికి కరోనా వైరస్ సోకిందన్నారు. కైకలూరు మండలంలో 93 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వీరిలో ఇద్దరికి వైరస్ సోకిందన్నారు. గుడ్లవల్లేరు మండలంలో 93 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో ఒకరికి వైరస్ సోకినట్టు తెలిపారు. కలిదిండి మండలంలో 124 మందికి కరోనా పరీక్షలు జరుపగా వీరిలో ఒకరికి వైరస్ సోకిందన్నారు. గుడివాడ రూరల్ మండలంలో 45 మందికి, గుడివాడ పట్టణంలో 74 మందికి, మండవల్లి మండలంలో 46 మందికి, పెదపారుపూడి మండలంలో 183 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికీ కరోనా వైరస్ సోకలేదన్నారు. డివిజన్ లో కరోనా పాజిటివిటీ రేటు 1.23 శాతానికి తగ్గిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *