Breaking News

డా.కె.ఎల్.రావు హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణలో డా.టి.వి.ఎస్.చలపతిరావు 42వ వర్థంతి కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని డా.కె.ఎల్.రావు హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణలో మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు డా.టి.వి.ఎస్.చలపతిరావు 42వ వర్థంతి కార్యక్రమం సోమవారం జరిగింది.  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్  రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజలతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. చలపతిరావు సమాధి వద్ద పూలమాల వేసి శాసనసభ్యులు మల్లాది విష్ణు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ టి.వి.ఎస్.చలపతిరావు  జీవితం వర్తమాన నాయకులకు మార్గదర్శకమన్నారు. చలపతిరావు ప్రజాహిత జీవనాన్ని గర్వించిన విజయవాడ ప్రజలు 1939లోనే ఆయనను మునిసిపల్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారన్నారు. 1942లో క్విటిండియా ఉద్యమ సందర్భంగా గాంధీజీని చెరసాల పాలుచేసినందుకు నిరసనగా టి.వి.ఎస్. ఛైర్మన్ పదవి పరిత్యజించారన్నారు. 1962లో తొలిసారి, 1967లో తిరిగి మరొకసారి శాసనసభకు ఎన్నికయ్యారన్నారు. కార్మిక సంఘటిత కార్యరంగంలో ఆయన సేవ నిరుపమానమన్నారు. మునిసిపల్ ఛైర్మన్‌గా ఉండగా మురికి కాలువలలో చీపురుతో దిగి శుభ్రం చేసిన వ్యక్తి అని అన్నారు. బలహీనవర్గాలకు, దళిత వర్గ ఉద్ధరణకు ఆయన చేసిన సేవ దేశంలోనే మరెవరూ చేసి ఉండరన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొప్పరపు బలరామకృష్ణమూర్తి, చింతకాయల చిట్టిబాబు, దమ్మాలపాటి చంద్రశేఖర్, వైసీపీ కార్పొరేటర్లు రెహమతున్నీసా, యలకల చలపతిరావు, కాపునాడు జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు, బీసీ నాయకులు తాడిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *