Breaking News

విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం…

-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని.. వీటి గూర్చి ప్రతిపక్షం, పచ్చ మీడియా ఏ రోజు మాట్లాడవని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 30 వ డివిజన్ లోని దావుబుచ్చయ్యకాలనీ, గద్దె వెంకట్రామయ్య నగర్, వినాయక్ నగర్ లలో డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ లో జరుగుతున్న ప్రగతి పనులను సందర్శించారు. ఇటీవల నిర్మించిన రోడ్లను పరిశీలించిన ఆయన.. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయవలసిందిగా అధికారులకు సూచించారు. డివిజన్ లోని చివరి గడప వరకు రోడ్లు, త్రాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాల సదుపాయం కల్పించాలని ఆదేశించారు. వర్షపు నీరు రోడ్లపై చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనులపై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విజయవాడ నగర ప్రగతికి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు  అన్నారు. గత తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో విజయవాడను మురికికూపంగా మార్చారని మండిపడ్డారు. డివిజన్ లో పేరుకుపోయిన సమస్యలు చూస్తుంటే గత తెలుగుదేశం ప్రభుత్వం కళ్లు మూసుకుని పాలన చేసిందా? అనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. విజయవాడలో నివాసముంటున్న లక్షలాది మందికి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకుండా.. రియల్ ఎస్టేట్ కోసం రూ. లక్ష కోట్లను చంద్రబాబు ఒక్క ప్రాంతంలోనే ఖర్చు చేయాలనుకున్నారని మండిపడ్డారు. ఆయన చేతగాని పాలన వల్ల నేటికీ వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరే కాలనీలు నగరంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే.. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు విశేషంగా నిధులను కేటాయించడం జరుగుతోందన్నారు. ఒక్క 30వ డివిజన్ లోనే గడిచిన రెండేళ్లలో రూ. 8.5 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో రూ. 2.5 కోట్ల పనులు ఇప్పటికే పూర్తికాగా.. రూ. 6 కోట్ల విలువైన పనులు వివిధ దశలలో ఉన్నట్లు తెలియజేశారు. కరోనా కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయని.. త్వరలోనే పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. మరోవైపు డివిజన్ వాసుల తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఒక ఓవర్ హెడ్ ట్యాంకును కూడా నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా డివిజన్ లో 1,326 మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక, 1,700 మందికి అమ్మఒడి, 1,056 మందికి ఇళ్ల పట్టాలు, 520 మందికి చేయూత, 85 మందికి కాపునేస్తం, 82 మందికి జగనన్న తోడు, 63 మంది చేదోడు, 189 మందికి వాహనమిత్ర, 340 మందికి విద్యాదీవెన పథకాల రూపంలో లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అజ్జా వెంకటేశ్వరరావు, రవి, గద్దె శ్రీను, ప్రసాద్, నూతక్కి శ్రీను, లక్ష్మీ నారాయణ, దుర్గారావు, సుబ్బారెడ్డి, లక్ష్మీ, రామకృష్ణ, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *