విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశ్రామిక వేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దేవినేని బాజి ప్రసాద్ చిరస్మరణీయులుని వైసీపీ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలో రాజకీయాల అతితంగా నాడు పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలు, వివక్ష చూసి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వారికి అండగా నిలిచిన బాబాయి స్వర్గీయ దేవినేని బాజి ప్రసాద్ ఆశయసాధనకు కృషి చేసారు అని అన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ కి రాజకీయంగా కుటుంబాపరంగా అండగా ఉండి పేదప్రజల సమస్యల పరిష్కరానికి కృషి చేశారని అన్నారు. సోమవారం బాజిప్రసాద్ 5వ వర్ధంతి కార్యక్రమాన్ని గుణదల తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు నాయకులు, అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నేడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా విద్యార్థులు ఇప్పటికి ఆయన సేవలను గుర్తుచేసుకొంటారని అంతలా ఆయన వారి గుండెల్లో నిలిచివున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం,మాజీ డిప్యూటీ మేయర్లు ఆళ్ల చల్లారావు, ముసునూరి సుబ్బారావు, కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జీలు, వైసీపీ నాయకులు, దేవినేని అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …