Breaking News

తెలుగు రాష్ట్రాల్లో మ‌న‌గుడి…

-ఆగ‌స్టు 20న వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, 22న శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, 30న శ్రీ‌కృష్ణాష్ట‌మి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆగ‌స్టు 20న వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, 22న శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, 30న శ్రీ‌కృష్ణాష్ట‌మి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ఆల‌యాల్లో నిర్వహించనున్నారు. కోవిడ్-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌తో ఈ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. ఆగ‌స్టు 20న ఆయా ఆల‌యాల్లో అర్చ‌కుల చేత వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 21 ఆల‌యాల్లో భ‌జ‌న కార్య‌క్ర‌మం చేప‌డ‌తారు. ఆగ‌స్టు 22న శ్రావ‌ణ పౌర్ణ‌మి సంద‌ర్భంగా పండితుల చేత ధార్మికోప‌న్యాసం, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 30న శ్రీ‌కృష్ణాష్ట‌మినాడు ఆయా ఆల‌యాల్లో గోపూజ‌, ఉట్టి ఉత్స‌వం జ‌రుపుతారు. టిటిడి హిందూ ధర్మప్రచారం లో భాగంగా టీటీడీ లోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు

-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *