విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒకరేమో రాష్ట్ర కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి, మరొకరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు. ఇరువురు సరదాగా చేసిన బైక్ రైడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఫార్చ్యూన్ మురళి పార్క్ హోటల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి (బౌన్స్ బైక్స్ సర్వీస్ లాంచింగ్) హాజరైన మంత్రి పేర్ని నాని, మల్లాది విష్ణు.. అనంతరం ఒకే కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. అలా కారు ఎక్కుదామని అనుకున్న వారికి.. ఉన్నట్లుంది బైక్ పై సరదాగా షికారుకు వెళ్లాలనిపించినట్లుంది. అంతే.. అనుకున్నదే తడవుగా నచ్చిన ఒక బైక్ తో రయ్ మనిపించారు. పేర్ని నాని డ్రైవ్ చేస్తుండగా.. మల్లాది విష్ణు వెనుక కూర్చొని పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపారు. ఇంకేముంది ఫోటోలు అలా క్లిక్ అనిపించాయి. లబ్బీపేట ఎంజీ రోడ్డు నుంచి మొగల్రాజుపురం, విశాలాంధ్ర, చుట్టుగుంట జంక్షన్, అల్లూరి సీతారామరాజు వంతెన నుంచి సాంబమూర్తి రోడ్డు మీదుగా ప్రెస్ క్లబ్ వరకు జోరుగా హుషారుగా వీరి జర్నీ సాగింది. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …