Breaking News

క్రిస్టియన్ కౌన్సిల్ వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా… : మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు ప్రాంతానికి చెందిన తాను క్రిస్టియన్ కౌన్సిల్ కు జాతీయ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అనేక పోరాటాలు చేస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో చర్చిలను నిర్మించే విషయంలో పాస్టర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామాల్లో నిర్మించే చర్చిలకు అవసరమైన అనుమతుల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాలను సంప్రదిస్తున్నామన్నారు. అయితే జిల్లా కలెక్టర్ అనుమతులు తీసుకోవాలని చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. తెలంగాణా రాష్ట్రంలో చర్చిల నిర్మాణానికి గ్రామాల పరిధిలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్యాలయాల ద్వారా అనుమతులు ఇస్తూ జీవోను కూడా జారీ చేశారన్నారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చర్చిల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం కూడా దృష్టిసారించి క్రైస్తవ సంఘాలకు న్యాయం చేయాలని జాన్ బెన్నీ లింగం విజ్ఞప్తి చేశారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *