గుడివాడ డివిజన్లో 2.75 లక్షల డోన్ల వ్యాక్సినేషన్… : మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ డివిజన్ లో ఇప్పటి వరకు 2 లక్షల 75 వేల 962 డోసుల వ్యాక్సినేషన్ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కొవిషీల్డ్ మొదటి డోసు ఒక లక్షా 31 వేల 092 మందికి, రెండవ డోసు 72 వేల 245 మందికి, ఐదేళ్ళ లోపు పిల్లలు ఉన్న తల్లులు 22 వేల 094 మందికి మొదటి డోసు, నలుగురికి రెండవ డోసు, గర్భిణులు 2 వేల 502 మందికి, 18 ఏళు ఏళ్ళు నిండిన వారు 3 వేల 216 మందికి మొదటి డోసు, 24 మందికి రెండవ డోసు, 3 వేల 630 మందికి టీచర్లకు వ్యాక్సిన్ వేశామన్నారు. కోవాగ్జిన్ మొదటి డోసు 20 వేల 787 మందికి, రెండవ డోసు 18 వేల 087 మందికి, ఐదేళ్ళ లోపు పిల్లలున్న తల్లులు 1,421 మందికి మొదటి డోసు, ఏడుగురికి రెండవ డోసు, 155 మంది గర్భిణులకు, 18 ఏళ్ళు పైబడిన టీచర్లు 1,401 మందికి మొదటి డోసు, ఇద్దరికి రెండవ డోసు వ్యాక్సిన్ వేసినట్టు మంత్రి కొడాలి నాని చెప్పారు.

 

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *