విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు వచ్చు అతిధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయుటతో పాటుగా మెరుగైన పారిశుధ్య పరిస్థితులు నెలకొల్పులని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సంబందిత అధికారులను ఆదేశించారు. నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి ఇందిరాగాంధీ అవుట్ డోర్ స్టేడియంను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబందించి చేపట్టవలసిన అంశాలపై అధికారులతో చర్చించి స్టేడియం నందు గ్రౌండ్ లెవెలింగ్ చేసి రోలింగ్ చేయాలనీ, మరియు అతిధులు వచ్చు మార్గం లెవెల్స్ చేసి ఎంట్రన్స్ పెయింటింగ్ నిర్వహించాలని మరియు అవసరమైన ప్రదేశాలలో తాత్కాలిక మరుగుదొడ్లు మరియు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. స్టేడియం ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలు అన్నియు శుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. గత రాత్రి కురిసిన భారి వర్షం కారణంగా స్టేడియం నందు నిలిచిన వర్షపు నీటిని హై టేక్ మిషన్ ద్వారా తోడించి అవసరమైనచో గ్రావెల్ వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీ.చంద్ర శేకర్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాత్రుడు మరియు పొలిసు, ఇతర విభాగాములకు సంబందించిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల వరద సాయాన్ని త్వరగా అందించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …