Breaking News

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలి… : కలెక్టర్ జె. నివాస్

-అధికారులతో సమావేశమై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు సమీక్షించిన
జిల్లా కలెక్టర్
-75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ జాయింటు కలెక్టర్ డిఆర్వో, ఆర్ డివోలతో కలసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ సందర్శించి అక్కడి ఏర్పాట్లు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు ఆగస్టు 15వ తేది రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి మరియు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు జాతీయ జెండా ఎగురవేస్తారని అన్నారు. గ్రౌండంతా పరిశుభ్రంగా సిద్ధం చేయాలని మార్చిఫాస్ట్, శకటాల ప్రదర్శన నిర్వహణకు ట్రాక్ సిద్ధం చేయాలన్నారు. వివిధ సంక్షేమశాఖలు శకటాలు ఎంత వరకు సిద్ధం చేసినది. కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను, స్వాతంత్ర్య సమర యోధులను లేదా వారి కుటుంబ సభ్యులను ముందుగా ఈ వేడుకలకు ఆహ్వనించి ఘనంగా సత్కరించుటకు తగిన ఏర్పాట్లు చేయలన్నారు. విఐపి పెరేడ్ పరశీలనకై సిద్ధం చేసిన వాహనాన్ని కలెక్టర్ పరిశీలించి వాహనాన్ని అందంగా అలంకరించాలన్నారు. శకటాలపై వివిధ పథకాల సమాచారంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత శాఖల మంత్రుల పోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలన్నారు. వివిధ శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పశుసంవర్ధకశాఖ మేలుజాతి పశువులు, మేకలను, ఖడగ్ నాద్ కోళ్లు ప్రదర్శనలో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయశాఖ ఈక్రాఫ్ బుకింగ్ అంశంపై శకటం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఐసిడిఎస్ శకటంపై చిన్నపిల్లలను ఉంచినప్పుడు వారు క్రింద పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. హౌసింగ్ శకటం జగనన్న కాలనీలు లే అవుట్లు, నిర్మిస్తున్న ఇళ్లు పోటోలతో ఫెక్సీలు , మత్స్యశాఖ లైవ్ పాండ్ మరియు లైవ్ చేపలను ప్రదర్శనలో ఉంచుతున్నట్లు తెలిపారు. వైద్యశాఖ వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అందులో ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, మందులు, మాస్క్ లు, శానిటైజేషన్లు సిద్ధం చేయలన్నారు. వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ప్రధమ చికిత్స కిట్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి మెరిటోరియస్ సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి టెంట్లు అన్ని వాటర్ ఫ్రూఫ్ ఏర్పాటు చేయలన్నారు.
ప్రజల ందరికి 75వ స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు కలెక్టర్ తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి, ఎఆర్ ఎఎపి బి. సత్యన్నారాయణ, బందరు డిఎపి మాసుం బాషా, తాసిల్దారు డి. సునీల్ బాబు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *