Breaking News

కళా బ్రతకాలి కళాకారుడు బ్రతకాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కలబ్రతకాలి కళాకారుడు బ్రతకాలి ఇది జరగాలంటే కళాకారులంతా ఒక్కటి అవ్వాలని ఇంద్రధనుస్సు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గర్రె శివ రమేష్ అన్నారు. కళాకారుల ఇక్యంగా ఉండేందుకు ఒక వేదిక కావాలని జూలైలో కళాకారుల ఐక్యవేదిక సమావేశానికి అందరూ కలిసి రావాలని మంగళవారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో గర్రె శివ రమేష్ మాట్లాడుతూ కళాకారులు అందరూ ఒకే వేదిక పైకి రావాలని ప్రస్తుతం కళాకారులందరికి వారి వారి వృత్తిలో ఉన్న సమస్యలపై అందరూ ఒక చోట సమీకరిం చుకొని కళాకారులందరూ ఏ సమస్య లేకుండా ఉండాలంటే సమాజంలో ఎవరెవరు నుంచి ఎలాంటి సహాయం , ప్రోత్సాహం లభిస్తుందని చర్చించుకుని ఒక ఎజెండాను రూపొందిం చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉన్నారు. ఈ సమావేశంలోఘంటశాల కల్చరల్ వ్యవస్థాపకులు సినీ డైరెక్టర్ ఎస్.కె హుస్సేన్ మాట్లాడుతూ రేపు జులై నెలలో విజయవాడ వన్ టౌన్ లో ఇంద్రధనుస్సు సకల కళాకారుల ఐక్యవేదిక పై రాష్రవహ వ్యాప్తంగా కళాకారుల అందరూ ఒక చోట కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని త్వరలో ఆ కార్యక్రమ పూర్తి వివరాలను మీకు తెలుపుతామని ఆయన అన్నారు. సమావేశం అనంతరం కళకు కలం తోడు అనే నినాదానికి మద్దతుగా ఏపీయూడబ్ల్యూ జే అధ్యక్షులు చావా రవి, సెక్రటరీ దారం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఇంద్రధనుస్సు ఐక్యవేదిక పేరును ప్రారం భించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్కే అమరావతి ఎంటర్టైనర్స్ అధినేత రోహిణి కాంత్ చిన్ని, విజయవాడ జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు సినీ నటులు వేంపల్లి గౌరీ శంకర కళాతపస్సు డాన్స్ అకాడమీ చైర్మన్ డాన్స్ మాస్టర్ సిహెచ్ రమేష్, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ ఎస్ నాయుడు, మూవీ డైరెక్టర్ శివ , నక్షత్ర కళావేదిక అధ్యక్షుల వరపర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *