Breaking News

యోగా మన దేశ గొప్ప సంపద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప సంపద యోగ అని క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంత జీవనశైలిని పొందవచ్చు అని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా
ప్రధాని మోడీ చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో భవానిపురం లోని పున్నమి ఘాట్, రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం మెగా యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశ , ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, రీజనల్ సైన్స్ సెంటర్ మెంబర్ సెక్రెటరీఅండ్ సి.ఈ. ఓ కే శరత్ కుమార్ ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మే 21 నుంచి జూన్ 21 వరకు నెలరోజులపాటు పండుగ వాతావరణం లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ వార్డుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు వయో, లింగ బేధం లేకుండా అందరూ యోగాను సాధన చేసి ఆరోగ్యాన్ని పొందాలన్నారు. ప్రతి ఒక్కరికి యోగ పై అవగాహన కల్పిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 5000 వేల మంది ట్రైనర్లతో 10 లక్షలమందికి యోగా నేర్పించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విశ్వవ్యాప్తంగా 170 కి పైగా దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించడం భారత్ కి గర్వకారణం అన్నారు.
ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చని సూచించారు. జూన్ 21న విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగాడే కార్యక్రమంలో పాల్గొని లక్షల మందితో కలిసి యోగ సాధన చేస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అంతర్జాతీయ యోగా టీచర్ శిరీష తమ విద్యార్థులతో ప్రదర్శింప చేసిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎస్ .ఆర్ ఆర్ .అండ్ సి .వి.ఆర్ కళాశాల హెచ్.ఓ.డి డాక్టర్ యుగంధర్, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం భవానిపురం బృందం సభ్యులు మరియు మంజుల యోగి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *