విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం సబ్ కలెక్టర్ జి.ఎస్. ఎస్.ప్రవీణ్ చంద్ సీనియర్ సిటిజన్ కోర్టును నిర్వహించారు. కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన తిరువీడి సారమ్మ కేసుకు సంబంధించి ఆమెకు నలుగురు కుమార్తెలు ఉన్నారు, వారిలో ఆమె రెండవ కుమార్తె పల్లి నాగేశ్వరమ్మ అన్ని ఆస్తులను లాక్కొని దరఖాస్తుదారుని శారీరక వేధింపులకు గురి చేసింది. అయితే పల్లి నాగేశ్వరమ్మ ఈ రోజు రానందున తదుపరి విచారణకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం పైదురుపాడు గ్రామానికి చెందిన వేముల వెంకటేశ్వర్ రావు ఇద్దరు కుమారులు అతడిని తన ఇంటిలో ఉండడానికి అనుమతించక పోగా తండ్రిని శారీరకంగా వేధించారు. దరఖాస్తుదారుని తన ఇంట్లోనే ఉండమని మరియు అతని కుమారులు వెంకటేశ్వరరావు కు ఏదైనా హాని చేస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వారికి జైలు శిక్ష విధించబడుతుందని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …