Breaking News

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మారిస్ స్టెల్లా కళాశాలలో ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తల్లికి వందనం పథకం అమలు మరియు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా గా జరిగింది. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, మహిళ పోలీస్ స్టేషన్ యన్ టి ఆర్ జిల్లా, లత కుమారి ముఖ్య అతిథి గా వచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు తల్లి దండ్రులను గౌరవించాలని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని లక్ష్య సాధన కు కృషి చేయాలి అని మత్తు పదార్థాలు కు బానిస కారాదని, తల్లి దండ్రులు కూడా పిల్లలను వారి ప్రవర్తనను గమనించుకోవాలని యువత కు బంగారు భవిష్యత్తు అందించటంలో ఉపాధ్యాయులు మరియు తల్లితండ్రులు ప్రముఖ పాత్ర పోషించాలని తెలిపారు.

లత కుమారి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్,మత్తు పదార్థాల వ్యతిరేక ప్రతిజ్ఞ ను చేయించి గోడ పత్రికను విడుదల చేశారు. మరియు విద్యార్ధినుల తల్లిదండ్రులకు సమాజ పురోభివృద్ధి కి ఇంకా తల్లిదండ్రులను పిల్లలు గౌరవించే విధంగా తల్లికి వందన సమర్పణ ను తల్లి చే మొక్కను నాటించే కార్యక్రమం ను నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో కళాశాల ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ సిస్టర్ ఇన్నసియమ్మ డిగ్రీ వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ సిస్టర్ ఆషా, జి ఉష కుమారి, ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న వున్నాం మరియు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ రమేష్,బర్డ్స్ యన్ జి వో ప్రకాష్ లు అధ్యాపకులు విద్యార్ధినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *