-కూటమి నేతలతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి లను (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని శుక్రవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్,40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పీవీ చిన సుబ్బయ్య లతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 40వ డివిజన్ బ్యాంక్ సెంటర్ కు చెందిన షేక్ నజీయ ( 38) గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలుపగా 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పీవీ చిన సుబ్బయ్య ఎన్డీఏ కార్యాలయంలో ఎల్. ఓ .సీ కొరకు దరఖాస్తు చేశారు. వారికి రూ 1లక్ష 46 వేల ఎల్.ఓ.సీ ను ఎన్డీఏ కూటమినేతల తో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఫణీంద్ర, నారాయణ, సురేష్, సంతోష్ సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News