Breaking News

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం

-క్యాన్సర్ బాధితుడికి రూ 10 వేల సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న క్యాన్సర్ బాధితుడు సయ్యద్ ఇబ్రహీం ( 54) కు ఎమ్మెల్యే సుజనా చౌదరి సాయం అందించారు. 34 వ డివిజన్ కేదారేశ్వర పేటకు చెందిన సయ్యద్ ఇబ్రహీం కిచిడి బండి నడుపుతూ భార్యా పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. గొంతు క్యాన్సర్ సోకడంతో కొద్ది నెలలుగా చికిత్స పొందుతూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తమ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమేనని సాయం అందించాలని బాధితుడు భార్య సయ్యద్ షాకీర 34 వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్ కు తెలియజేయగా ఆయన ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ రూ 10 వేలను ఆర్థిక సాయం అందించారు. అతనికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ కార్యాలయ సిబ్బంది ద్వారా అత్యవసర సాయం అందించిన ఎమ్మెల్యే సుజనా కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు రుద్ర పాటి వెంకటేష్, అట్లూరి కొండలరావు, ఆకుల రవిశంకర్, బొడ్డు నాగలక్ష్మి, సుజనా మిత్ర కోఆర్డినేటర్ లక్ష్మీ ప్రసన్న , అయ్యప్ప కార్యాలయ సిబ్బంది చింతా సృజన్ ( బాబీ) పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *