Breaking News

చిట్టినగర్ స్వరంగంలో లైట్లను పెంచండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ స్వరంగంలో లైట్లను పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వస్త్రలత, పంజా సెంటర్, గాంధీ హిల్ ఏరియా, చిట్టినగర్, కలరా హాస్పిటల్, సితార సెంటర్, విద్యధరపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, రామరాజ్యనగర్, నాలుగు స్తంభాల సెంటర్, అంబేద్కర్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిట్టినగర్ స్వరంగంలో పెయింట్లను పూర్తి చేసి త్వరగా మరికొన్ని లైట్లు అమర్చాలని అధికారులను ఆదేశించారు. వన్ టౌన్ లో – బ్రిడ్జ్ పరిశీలించి, గతవారం మరమ్మతులు చేపట్టాలని ఆదేశించిన ఇంకా మరమ్మతులు ఎందుకు చేపట్టలేదని అధికారులను అడిగారు, ఇరిగేషన్ శాఖ సమన్వయం తో మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, వస్త్రలత, సితార సెంటర్, చిట్టినగర్ కాంప్లెక్స్ లో గల విజయవాడ నగర పాలక సంస్థ కాంప్లెక్స్లలో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, ఏమైనా ఉన్న వెంటనే ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో గల అన్న క్యాంటీన్ పరిశీలించారు. త్రాగునీటి, వాడుకనీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, వర్షాకాలం దృశ్య పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండరాదని, నోడల్ ఆఫీసర్లు నిరంతరం తమ తమ అన్న క్యాంటీన్ ను పరిశుభ్రంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్ర బోస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *