విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో కేవలం మాటలకే పరిమితం అయిన ప్రజల వద్దకే పరిపాలన ను సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం నియోజకవర్గంలోని హరిజనవాడ 12 వ సచివాలయ పరిధిలో సిబ్బంది, కార్పొరేటర్ తో కలిసి ప్రభుత్వం చేపట్టిన సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాలన,సంక్షేమ పథకాల అమలు, వాలంటర్ ల పనితీరు పై ప్రజల స్పందన ను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా డివిజన్ లో జరుగుతున్న మెగా వ్యాక్షినేషన్ డ్రైవ్ ను పర్యవేక్షించి డ్రైవ్ జరుగుతున్న తీరును వైద్య సిబ్బంది ని అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు నేపథ్యంలో అందరికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఈ మెగా డ్రైవ్ చేపట్టడం జరిగిందని ప్రజలు అందరూ వ్యాక్సిన్ తీసుకొనేలా వైద్య సిబ్బంది, వైస్సార్సీపీ నాయకులు చొరవ తీసుకుని వారిలో నెలకొన్న సందేహాలను,భయాలను నివృత్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు కావాలని, ఇంకా ప్రభుత్వం తరపున ఏదైనా లోపాలు ఉన్నాయా, వాలంటీర్ వ్యవస్థ పనితీరు గురుంచి నేరుగా ప్రజలనే అడిగి అభిప్రాయలు సేకరించేలా చేపట్టిన సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం దేశంలో ఎక్కడా లేనివిధంగా చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ తీరు పై ప్రజలలో వ్యక్తమవుతున్న సానుకూల స్పందన చుస్తుంటే చాలా ఆనందంగా ఉందని మరల జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు అంత కోరుకొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రవళ్ళిక, అంబేద్కర్, వైస్సార్సీపీ నాయకులు గల్లా రవి, డేవిడ్ రాజు, భీమిశెట్టి బాబు, మతాంగి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …