పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజకవర్గంలో పూర్తిగా పాడై పోయినా ఆర్ అండ్ బి రహదారులను త్వరలోనే పునర్నిర్మించి, అభివృద్ధి పరుస్తామని శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం పామర్రు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆర్ అండ్ బి అధికారులతో నియోజకవర్గం లో చేపట్టనున్న రహదారుల అభివృద్ధి పై సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ నియోజక వర్గం లోని ఐదు మండలాల్లో పూర్తిగా పాడై పోయినా ఆర్ అండ్ బి రహదారులను త్వరలోనే పునర్నిర్మించి, అభివృద్ధి పరుస్తామన్నారు. ఇప్పటికే కొన్ని రోడ్లు కు నిధులు మంజూరు అయ్యాయని, మరికొన్ని రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుని వాటిని కూడా అభివృద్ధి పరుస్తామన్నారు. గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శ్రీనివాస్ మూర్తి, ఆర్ అండ్ బి ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags pamarru
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …