Breaking News

క్రీబ్కో ఛైర్మన్ వల్లభనేని సుధాకర్ చౌదరి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల  క్రీబ్కో చైర్మన్ గా ఎన్నికైన వల్లభనేని సుధాకర్ చౌదరి కి మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శుభాకాంక్షలు తెలిపారు. సహకార రంగంలోని రెండవ అతిపెద్ద ఎరువుల కంపెనీ క్రీషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ నూతన చైర్మన్ గా విజయవాడ కు చెందిన వ్యాపారవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ను మర్యాదపూర్వకంగా కలవగా సుజనా శుభాకాంక్షలు తెలిపారు. సుధాకర్ చౌదరి సారధ్యంలో సహకార,వ్యవసాయ రంగాలు మరింత బలోపేతం అవుతాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *