విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత నాలుగు రోజులుగా ట్రాన్స్ జెండర్స్ పై మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని హిజ్రా హక్కుల సంఘం సభ్యురాలు నవ్య వెల్లడించారు. ఎవరో ఒకరు చేసిన తప్పిదానికి ట్రాన్స్ జెండర్ అందరికి సమాజంలో చెడ్డ పేరు వచ్చేలా ప్రచారం జరుగుతుందని తాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ హిజ్రా హక్కుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గిరిపురం ఏరియా పరిధిలో ట్రాన్స్ జెండర్ దమయంతి (డానియల్) అనే వ్యక్తి తన బంధువుల మధ్య వచ్చిన వివాదం లో అసభ్యకరంగా ప్రవర్తించినందుకుగాను ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు మాకు ఏ విధమైన సంబంధం లేదని గతంలో దమయంతి ప్రవర్తన సరిగా లేనందున విజయవాడ పరిధిలో మా సంఘం నుండి వెలివేయడం జరిగినది. అతను పది సంవత్సరాలుగా మంటాడ గ్రామంలో నివసిస్తున్నాడు. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా
మా ట్రాన్స్ జెండర్స్ అందరిపై నిందలు వేస్తూ మా మనోభావాలను దెబ్బతీసే విధంగా అనేక మద్యమాలలో విస్తృత ప్రచారం జరుగుతుందని ఆవేదనకు వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరియైన చర్యలు కాదని ఈ విషయమై అధికారులు అందరికీ వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News