Breaking News

గురుకులాల్లో చదివే ప్రతి ఎంపీసీ విద్యార్థి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్… ప్రతి బైపీసీ విద్యార్థి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ కావాలి

-పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలు, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు
-పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం
-మీరంతా ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా కృషి చేయాలి
-మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి
-విజయవాడలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్ల సిబ్బందికి శిక్షణ తరగతులు
-శిక్షణ తరగతులను ప్రారంభించిన మంత్రి డా.స్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గురుకులాల్లో చదివే ప్రతి ఎంపీసీ విద్యార్థి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్… ప్రతి బైపీసీ విద్యార్థి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయ్యేలా వారిని తీర్చిదిద్దాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు విజయవాడ లెనిన్ సెంటర్ లోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులాల ఐఐటీ నీట్ , ఎక్సలెన్సీ సెంటర్ల సిబ్బందికి శిక్షణ తరగతులు శనివారం నాడు మంత్రి డా.స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……గురుకులాల విద్యార్థులకు ఉచిత ఐఐటీ, నీట్ కోచింగ్ కు నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల సహకారం మరువలేనిదన్నారు.గురుకులాల్లో చదివే ప్రతి ఎంపీసీ విద్యార్థి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్… ప్రతి బైపీసీ విద్యార్థి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయ్యేలా వారిని తీర్చిదిద్దాలన్నారు. పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలని వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆ లక్ష్యసాధన కోసమే ఆయన తన పాలనా కాలంలో అనేక ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలిపారు. సిబ్బంది నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండి అర్థమయ్యేలా తరగతులు బోధించాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో AP SWREIS సెక్రటరీ వి.ప్రసన్న వెంకటేష్, అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *