– ఘనంగా ముగిసిన లీప్ క్రికెట్ టోర్నమెంట్
– ఛాంపియన్స్ గా విజయం సాధించిన శ్రీకాకుళం సన్ రైజర్స్
– రన్నరప్ గా కృష్ణా రాయల్స్
– ట్రోఫీలు ప్రధానం చేసిన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ సిబ్బందికి నిర్వహించిన లీప్ క్రికెట్ టోర్నమెంట్ 2025 శనివారంతో ముగిసింది. అన్ని జిల్లాల నుండి 16 జట్లు తలపడగా, ఫైనల్సుకు చేరుకున్న శ్రీకాకుళం సన్ రైజర్స్, కృష్ణా రాయల్స్ మధ్య ఈరోజు పోటీ హోరాహోరీగా జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం సన్ రైజర్స్ 20 ఓవర్లకు 211 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన కృష్ణా రాయల్స్ 20 ఓవర్లకు 148 పరుగులు చేసి ఆలౌట్ అయ్యి రన్నర్సుగా నిలిచింది. శ్రీకాకుళం సన్ రైజర్స్ ఛాంపియన్ గా విజయకేతనం ఎగురవేసింది.
ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు IAS., మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికి శారీరక వ్యాయామంతో పాటు క్రీడా స్ఫూర్తి అవసరం అని, తద్వారా మానసిక ఒత్తిడి జయించవచ్చని అన్నారు.
అనంతరం విజేతలకు ట్రోపీలు అందజేశారు. కార్యక్రమంలో కేజీబీవీ సెక్రెటరీ డి.దేవానందరెడ్డి , స్కూల్ గేమ్ ఫెడరేషన్ స్టేట్ సెక్రటరీ జి. భానుమూర్తిరాజు , ఎన్టీఆర్, శ్రీకాకుళం జిల్లాల డీఈవోలు, ఎపీసీలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News